జెన్కోకు 75 వేలు.. యాదాద్రికి 16వేల టన్నుల బొగ్గు
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో బొగ్గు సరఫరాపై టీజీ జెన్కో, సింగరేణిలు దృష్టిసారించాయి.
- సింగరేణి, జెన్కో సమన్వయ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో బొగ్గు సరఫరాపై టీజీ జెన్కో, సింగరేణిలు దృష్టిసారించాయి. ఇందుకు సంబంధించి జెన్కోకు రోజుకు 75 వేల టన్నులు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు రోజుకు 16 వేల టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఇరు సంస్థలు అంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సింగరేణి భవన్ నుంచి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీశ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జెన్కోకు అధికంగా బొగ్గు సరఫరాను పెంచాలని ఇరు సంస్థల అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధప్రకాశ్ జ్యోతి మాట్లాడుతూ.. నైనీ గని నుంచి రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెలాఖరుకు నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గును నైనీ గని నుంచి రవాణా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి రోజూ నైనీ బొగ్గు రవాణా విషయంలో తెలంగాణ జెన్కో అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

