SIAM | ఆటో ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఉపాధ్యక్షుడిగా వీఈ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ (వీఈసీవీ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో వినోద్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఎచిర్ మోటార్స్, వోల్వో గ్రూప్ జాయింట్ వెంచర్ వీఈసీవీ. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు సియామ్ ఉపాధ్యక్షుడిగా అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో విపిన్ సొంది పని చేశారు.
అశోక్ లేలాండ్ సంస్థకు విపిన్ సొంది రాజీనామా చేయడంతో సియామ్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు సియామ్ ఉపాధ్యక్షుడిగా విపిన్ సొంది సేవలందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవా తెలిపారు. ఇంతకుముందు వినోద్ అగర్వాల్.. సియామ్ కోశాధికారిగా పని చేశారు.