Shiv Nadar | దాతృత్వంలో ఫస్ట్ హెచ్ సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్.. పిన్న వయస్కుల్లో నిఖిల్ కామత్..!
Shiv Nadar, | గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు.
Shiv Nadar | దాతృత్వం అనేది ఒక వరం. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న మేరకు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇక వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల్లో కూడా దాతలు ఉంటారు. అలా దాతృత్వంలో మొదటి వరుసలో నిలుస్తారు ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ (79). గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు. అంటే ప్రతి రోజూ రూ.5.9 కోట్లు విరాళం ఇస్తూ వచ్చారని ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ -2024 పేర్కొంది. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు అందజేశారు.
ఇక మహిళల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని సతీమణి రోహిణి నిలేకనీ మొదటి స్థానంలో నిలుస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.154 కోట్ల విరాళాలు అందజేశారు. రోహిణి నిలేకని ఫిలాంత్రఫీస్ అనే ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న సంస్థలకు, పర్యావరణ సుస్థిరత కోసం విరాళాలు అందజేస్తుంటారు.
దాతల్లో పిన్న వయస్కుడు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (38) మొదటి స్థానంలో ఉంటారు. మానసిక ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, విద్యా రంగం కోసం విరాళాలు ఇస్తారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఎడిల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ -2024లో 203 మంది దాతలు రూ.8,783 కోట్ల విరాళాలు ఇచ్చారు. రెండేండ్ల క్రితంతో పోలిస్తే 55 శాతం విరాళాలు పెరిగాయి. 18 మంది దాతలు రూ100 కోట్ల పై చిలుకు విరాళాలు ఇచ్చారు. 30 మంది దాతలు రూ.50 కోట్ల పై చిలుకు (2019 నుంచి 125 శాతం వృద్ధి), 61 మంది దాతలు రూ.20 కోట్ల పై చిలుకు (ఐదేండ్ల క్రితంతో పోలిస్తే 128 శాతం వృద్ధి) విరాళాలు అందజేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

