Crypto Tax | కొత్త పన్ను పాలసీ.. క్రిప్టోలు వదిలించుకోవడమే మంచిదా?!
Crypto Tax | ఏప్రిల్ నుంచి కొత్త పన్ను పాలసీ అమల్లోకి వస్తుండటంతో క్రిప్టో కరెన్సీలను వదిలించుకోవడమే బెటర్ అంటున్నారు.
Crypto Tax | మీరు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారా.. అయితే.. ప్రస్తుతం ట్రేడింగ్‌లో లాభాలు పొందేందుకు (నష్టాలు వచ్చినా సరే) మంచి అవకాశం. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులకు వచ్చే లాభాలపై కఠినమైన పన్ను నిబంధనలు అమలు చేయనున్నట్లు గత నెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కఠిన నిబంధనలను సవరించాలని క్రిప్టో ఇండస్ట్రీ చేసిన సూచనలను ఆమోదించడానికి కేంద్రం ససేమిరా అంటున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడులపై నూతన పన్ను నిబంధనలు రాబోతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ లోపు కనుక ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు.
వచ్చే సంవత్సరం నుంచి 30% పన్ను
ఈ నెలాఖరులోగా క్రిప్టో కరెన్సీలను విక్రయించగా వచ్చే లాభాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్‌లో చూపొచ్చు. ఆ లాభాలపై పన్ను ఒక మోస్తరుగా ఉంటుంది. కానీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులకు వచ్చే లాభాలపై 30 శాతం పన్ను వసూలు చేస్తారు. ఇన్వెస్టర్‌కు వచ్చే ఆదాయంతో నిమిత్తం లేదు. ఇతర మార్గాల్లో ఆదాయం లేని పెట్టుబడి దారులు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడిపై వచ్చే ప్రతి రూపాయికి 30 శాతం పన్ను చెల్లించాల్సిందే. క్రిప్టో కరెన్సీల్లో వచ్చే నష్టాలను ఇతర మార్గాల్లో వచ్చే లాభాలతోనూ సర్దుబాటు చేయడానికి వీల్లేదు. నష్టపోయిన పెట్టుబడిదారులకు ఈ రూల్ వర్తిస్తుంది.
ఏప్రిల్ నుంచి సర్దుబాట్లకు నో
ఒకవేళ ఈ నెలాఖరు (మార్చి 31) లోగా నష్టాలొచ్చినా ఇతర పెట్టుబడి లాభాలతో సర్దుబాటు చేయొచ్చు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇటువంటి సర్దుబాట్లను ఆదాయం పన్నుశాఖ అనుమతించదు. భారీమొత్తంలో ఆదాయం పన్ను వసూలు చేయడం ద్వారా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టకుండా ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరిచేందుకేనని నిపుణులు అంటున్నారు.
క్రిప్టోలను నిరుత్సాహ పరిచేందుకే..
భారత్‌లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నం అని డెల్లాయిట్ పార్టనర్ రోహిన్టన్ సిధ్వా చెప్పారు. వివిధ క్రిప్టో కరెన్సీల మధ్య లావాదేవీలను నిరోధించడం కూడా ట్రేడర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. కానీ క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై నిబంధనలు సడలిస్తారని ఇప్పటికీ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలపై పన్ను విధానం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి చెప్పారు. ప్రభుత్వ విధానం ఆశించిన ఫలితాలివ్వదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

