Secured Credit Card | సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అంటే ఏంటి?.. వాటిని ఎవరికి ఇస్తారు?
మీరెక్కడా ఇప్పటిదాకా రుణాలు తీసుకోకుంటే మీకు రుణ చరిత్రే ఉండదు, రుణ ఎగవేతలున్నా క్రెడిట్ స్కోర్ బాగుండదు.. అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు తప్పకుండా తిరస్కరణకు గురవుతుంది. అలాంటివారి ఆర్థిక అవసరాలకు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు సరిపోతాయి.
Secured Credit Card | మీరెక్కడా ఇప్పటిదాకా రుణాలు తీసుకోకుంటే మీకు రుణ చరిత్రే ఉండదు, రుణ ఎగవేతలున్నా క్రెడిట్ స్కోర్ బాగుండదు.. అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు తప్పకుండా తిరస్కరణకు గురవుతుంది. అలాంటివారి ఆర్థిక అవసరాలకు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు సరిపోతాయి. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్లతో సంబంధం లేకుండా బ్యాంకులు ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి మరి.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అంటే?
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను నగదు పూచీకత్తుపైనే జారీ చేస్తారు. క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపుల్లో ఎగవేతలకు ఆస్కారమున్నప్పుడు బ్యాంకర్లు తమ రక్షణార్థం వీటిని కస్టమర్లకు ఇస్తారు. దీనివల్ల కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేకపోయినా బ్యాంకులకు నష్టం వాటిల్లదు. కార్డు కోసం పూచీకత్తుగా పెట్టిన నగదును ఆ బకాయిల కింద జమ చేసుకుంటారు. కార్డు పరిమితి రూ.50,000 కావాలనుకుంటే, అంతే మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు కావాలన్నా.. అంతే మొత్తాలు డిపాజిట్ చేయాలి. మీరు చేసే డిపాజిట్లనుబట్టే మీరు పొందే క్రెడిట్ కార్డుకున్న రుణ పరిమితులు ఆధారపడి ఉంటాయి.
- విద్యార్థులు, అప్పుడప్పుడే సంపాదనలోపడ్డవారికి ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను ఎక్కువగా బ్యాంకింగ్ సంస్థలు సూచిస్తాయి. అలాగే ఇటీవలికాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను చవిచూసినవారు.. క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా వారి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది గనుక ఇవే వస్తాయి.
- రుణ చరిత్ర లేనివారికి ఈ కార్డుతో క్రెడిట్ స్కోర్ ఏర్పడుతుంది. సక్రమ లావాదేవీలతో క్రెడిట్ స్కోర్‌ను క్రమేణా పెంచుకోవచ్చు.
- ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు.. రెగ్యులర్ క్రెడిట్ కార్డు మాదిరే ఉంటుంది. చెల్లింపులు, వడ్డీలు, జరిమానాల్లో ఏ తేడాలు ఉండవు.
- తొలుత తీసుకున్న సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును క్రమశిక్షణతో వినియోగిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. దాని ఆధారంగా రెగ్యులర్ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

