SBI WeCare | ఎస్బీఐ `వుయ్‌కేర్.. మార్చి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇందులో లాభాలివి!
SBI WeCare | సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రారంభించిన `వుయ్‌కేర్` డిపాజిట్ స్కీం గడువు వచ్చే మార్చి వరకు పొడిగించారు.
SBI WeCare | సీనియర్ సిటిజన్ల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రారంభించిన `వుయ్ కేర్` స్పెషల్ డిపాజిట్ స్కీంను వచ్చే ఏడాది (2023) మార్చి వరకు పొడిగించింది. తొలుత 2020 సెప్టెంబర్ వరకు మాత్రమే నిర్వహించారు. కానీ, ఈ పథకం లైఫ్ మరింత పెరిగింది. దీని కింద సీనియర్ సిటిజన్లు.. సాధారణ పౌరుల కంటే ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఈ పథకం కింద ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ గడువుతో సీనియర్ సిటిజన్లు మదుపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.80 శాతం వడ్డీ పొందొచ్చు.
ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ గరిష్టంగా 5.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లు చేసే సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.50 శాతం వడ్డీ పొందొచ్చు.. వుయ్ కేర్ స్కీం కింద ఐదేండ్ల కాలానికి పెట్టుబడి పెట్టిన వారు 6.30 శాతం వడ్డీ ఆదాయం అందుకోవచ్చు. అయితే, ముందస్తు విత్ డ్రాయల్స్‌పై అదనపు వడ్డీ లభించదు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ 2.90 నుంచి 5.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 3.40-6.30 శాతం మధ్య వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్ల సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ అందుకుంటే.. `వుయ్‌కేర్` స్కీం కింద ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.30 శాతం వడ్డీ ఆదాయం పొందొచ్చు.
ఎస్బీఐ `ఫిక్స్డ్ డిపాజిట్ల`పై వడ్డీరేట్లు ఇలా
గడువు ——————————– సాధారణ పౌరుల ———— సీనియర్ సిటిజన్లకు
వడ్డీరేటు ( శాతం) ———— వడ్డీరేటు (శాతం)
7-45 రోజులు ————————- 2.90 —————————– 3.40
46-179 రోజులు ———————– 3.90 —————————– 4.40
180-210 రోజులు ——————— 4.40 —————————– 4.90
211 రోజుల నుంచి ఏడాది ———– 4.60 —————————– 5.10
ఏడాది నుంచి రెండేండ్లు ———— 5.30 —————————- 5.80
రెండేండ్ల నుంచి మూడేండ్లు ——– 5.35 —————————- 5.85
మూడేండ్ల నుంచి ఐదేండ్లు ——— 5.45 —————————- 5.95
ఐదేండ్ల నుంచి పదేండ్లు ———— 5.50 —————————- 6.30
ఉత్సవ్ డిపాజిట్ కింద కూడా అధిక వడ్డీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఎస్బీఐ `ఉత్సవ్ డిపాజిట్` స్కీం ప్రారంభించింది. 1000 రోజుల గడువు గల ఈ స్కీమ్‌పై 6.10 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకైతే అదనంగా 0.50 శాతం వడ్డీ అందుతుంది. రూ.2 కోట్ల వరకు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉత్సవ్ డిపాజిట్ స్కీం కింద వచ్చేనెల 28 లోపు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి అవకాశం ఉంది.
పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌పై 7.4 శాతం వడ్డీ
ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ ఆదాయం కావాలనుకుంటే పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ పథకం కింద అత్యధికంగా 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ. ఈ ఖాతాను 60 ఏండ్ల వయస్సు దాటిన తర్వాత తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ వీఆర్ఎస్ తీసుకుంటే 55 ఏండ్ల నుంచి 60 ఏండ్ల లోపు ఖాతా ఓపెన్ చేయాలి. ఈ స్కీం కింద ఐదేండ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ తేదీ దాటిన తర్వాత మూడేండ్లు కొనసాగించొచ్చు. ఈ స్కీం కింద ఇన్వెస్ట్మెంట్లకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఆదాయం పన్ను మినహాయింపు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

