SBI We Care | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. తీసుకొచ్చిన ‘వుయ్ కేర్’ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు అత్యధికంగా వడ్డీ రేటు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ పొందనున్నది. కొత్త డిపాజిటర్లతోపాటు రెన్యూవల్ చేసుకునే వారు బెనిఫిట్ పొందొచ్చు.
సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 50 బేసిక్ పాయింట్లతోపాటు కార్డు రేటుపై 50 బేసిక్ పాయింట్లు కలిపి 100 బేసిక్ పాయింట్లు అదనంగా ‘వుయ్ కేర్’ స్కీం కింద వడ్డీరేటు అందిస్తామని ఎస్బీఐ తెలిపింది. అయితే, ఈ పథకంలో చేరడానికి 60 ఏండ్లు దాటిన వారే అర్హులు. నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, బ్యాంకు శాఖ ద్వారా ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. కనీసం ఐదేండ్ల నుంచి పదేండ్ల గరిష్ట గడువు వరకూ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు. గరిష్టంగా రూ.2 కోట్లు డిపాజిట్ చేయడంతోపాటు దానిపై లోన్ కూడా తీసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఇదే తరహా పథకాలు తీసుకొచ్చాయి.