రికరింగ్ డిపాజిట్ స్కీం.. ఎస్బీఐ, పోస్టాఫీసుల్లో ఏది బెస్ట్..!
Recurring Deposit | ప్రతి ఒక్కరూ పోస్టాఫీసు, ఎస్బీఐ నిర్వహిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ల్లో వెసులుబాటును బట్టి చేరొచ్చు. .
Recurring Deposit | రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ).. ఈ పథకంలో ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం నగదు డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తూ పోవడంతో భారీ మొత్తం నిధి సమకూరుతుంది. ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రికరింగ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. మరోవైపు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై 5.80 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. రికరింగ్ డిపాజిట్ పథకంలో వడ్డీరేటును మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదు. రికరింగ్ డిపాజిట్ పథకానికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకాల్లో సారూప్యతలు.. తేడాలు తెలుసుకుందామా..!
రికరింగ్ డిపాజిట్ లేదా ఆర్డీ అంటే మీరు భారీ మొత్తం ఆదా చేయడమే. దీన్ని ఒక పిగ్గీ బ్యాంక్‌గా కూడా వాడుకోవచ్చు. ప్రతి నెలా వేతనం రాగానే నిర్దిష్ట మొత్తం డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ తేదీ వచ్చాక భారీ మొత్తం నిధి మీ చేతిలో ఉంటుంది.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లో ముఖ్యాంశాలు
- ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకంలో ఏడాది నుంచి 10 ఏండ్ల పీరియడ్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
- ఎస్బీఐ ఆర్డీపైన గరిష్టంగా 5.40 శాతం వడ్డీ లభిస్తుంది.
- సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీ పొందొచ్చు.
- ప్రతి నెలా కనీసం రూ.100 నుంచి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు.
- గరిష్ట డిపాజిట్‌కు పరిమితి లేదు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ విశేషాలు
- ఐదేండ్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీ ఆకాంక్షలను బట్టి తర్వాత పొడిగించొచ్చు.
- ఒకవేళ ఐదేండ్ల లోపు విత్ డ్రా చేసుకుంటే పెనాల్టీ చెల్లించాలి
- పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంపై 5.8 వడ్డీరేటు పొందొచ్చు.
- ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయాలి. ఆ పై ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు.
- గరిష్ట డిపాజిట్‌కు పరిమితి లేదు.
- మెచ్యూరిటీ తర్వాత ఇలా
పోస్టాఫీసులు ప్రతి నెలా రూ.1000 చొప్పున డిపాజిట్ చేస్తే ఐదేండ్ల తర్వాత రూ.69,412 లభిస్తుంది. ఎస్బీఐలో ప్రతి నెలా రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే ఐదేండ్ల తర్వాత రూ.68,704 పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్‌పై రూ.40 వేల (సీనియర్ సిటిజన్లకు రూ.50 వేలు) వడ్డీ వస్తుంది. దీనిపై ఆదాయం పన్ను చెల్లించక్కర్లేదు. ఇంత కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌కు ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేండ్ల లోపు ఈ పథకం నుంచి విత్‌డ్రా చేసుకోరాదు. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ఏడాది నుంచి పదేండ్ల వరకు ఎంచుకోవచ్చు. దీని ప్రకారం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కంటే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకంపైనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అయితే మీ ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

