రుణ గ్రహీతలకు ఎస్బీఐ షాక్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేట్(ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్(ఆర్ఎల్ఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం మేర పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటితో లింకైన రుణాలపై వడ్డీ మరింత పెరుగనున్నది.
- పావు శాతం వడ్డీరేట్లను పెంచిన బ్యాంక్
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేట్(ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్(ఆర్ఎల్ఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం మేర పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటితో లింకైన రుణాలపై వడ్డీ మరింత పెరుగనున్నది. రిజర్వుబ్యాంక్ ఇటీవల రెపోరేటును పావు శాతంమేర పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లొకి రానున్నట్టు బ్యాంక్ పేర్కొంది.
తాజా నిర్ణయంతో ఈబీఎల్ఆర్ 7.90 శాతం నుంచి 8.15 శాతానికి చేరుకోగా, ఆర్ఎల్ఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.75 శాతానికి చేరుకున్నది. ఆయా కాలపరిమితిని బట్టి వడ్డీరేట్లలో మార్పులు చేసింది. దీంట్లోభాగంగా ఒక్కరోజు, నెల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రుణాలపై వడ్డీని యథాతథంగా ఉంచిన బ్యాంక్..మిగతా కాలపరిమితి రుణాలపై వడ్డీని పెంచింది. కానీ, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని యథాతథం 14.65 శాతం వద్ద కొనసాగిస్తున్నది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు రుణాలపై వసూలు చేయగల కనీస వడ్డీ రేటును నిర్వహిస్తున్నది. ఒక బ్యాంకు తన నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రేటును నిర్ణయిస్తాయి. సాధారణంగా గృహ, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు ఎంసీఎల్ఆర్లో ముడిపడివుంటాయి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

