Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ కొత్త రంగు ఆప్షన్‌తో భారత్ మార్కెట్లోకి తెచ్చింది.
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ కొత్త రంగు ఆప్షన్‌తో భారత్ మార్కెట్లోకి తెచ్చింది. టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంతకుముందు టైటానియం గ్రే, టైటానియం వయోలెట్, టైటానియం బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. గెలాక్సీ ఏఐ, పలు అడ్వాన్స్డ్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా వస్తోంది. ఇందులో లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు జత చేశారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్లో ఫోన్ ధరలు ఇలా..
-12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ – రూ.1,29,999 (ఆఫర్లతో కలిపి రూ.1,17,999)
– 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ – రూ.1,39,999 (ఆఫర్లతో కలిపి రూ.1,27,999).
– 12 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ – రూ.1,59,999 (ఆఫర్లతో కలిపి రూ.1,47,999).
రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.6,000 అప్ గ్రేడ్ బోనస్, వివిధ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ 2.2 గిగా హెర్ట్జ్ నుంచి 3.39 గిగా హెర్ట్జ్ సామర్థ్యం గల సీపీయూతో కూడిన ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 3120×1440 పిక్సెల్స్ క్వాడ్ హెచ్డీ+ రిజొల్యూషన్ తో 6.8 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
200 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా, 3ఎక్స్ అండ్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ తోపాటు 50 మెగా పిక్సెల్ ,12 మెగా పిక్సెల్, 10 మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇంటర్ ఫేస్ విత్ యూఎస్బీ 3.2 జెన్ 1, జీపీఎస్, గ్లోనాస్, బైడూ, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, వై-ఫై 802.11ఏ/బీ/జీ/ఎన్/ఏసీ ఎఎక్స్/ బీఈ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బ్లూటూత్ వీ 5.3, యూహెచ్డీ 8కే వీడియో రికార్డింగ్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

