Samsung Galaxy S24 | శాటిలైట్ కనెక్టివిటీ.. ఆల్ట్రా హెచ్డీఆర్ మద్దతుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఆవిష్కరణ..?!
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ, ఆల్ట్రా హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తున్నది.
Samsung Galaxy S24 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ 2024 జనవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ (Samsung Galaxy S24) ఫోన్లు ఆవిష్కరించనున్నది. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలోనూ వీటిని ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24+, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా మోడల్స్ ఉన్నాయి. వీటిల్లో జూమ్ ఎనీ ప్లేస్, శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని వార్తలొచ్చాయి. హెచ్డీఆర్ మద్దతుతో ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ6 వర్షన్‌పై పని చేస్తాయని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ లేదా ఎక్స్‌నోస్ చిప్సెట్తో వస్తాయని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రా ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 +, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్లు డెకాకోర్ ఎక్స్‌నోస్ 2500 ఎస్వోసీ చిప్సెట్తో వస్తాయని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుందని వార్తలొచ్చాయి. 200-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ2ఎస్ఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 12-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 564 ఆల్ట్రావైడ్ కెమెరా, 10-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ టెలిఫోటో లెన్స్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 48-మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 48-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటాయని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 25 వాట్ల ఫాస్ చార్జింగ్ మద్దతుతో 4900 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.., శాంసంగ్ గెలాక్సీ ఎస్24+, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్లు 45-65 వాట్ల చార్జింగ్ స్పీడ్ మద్దతు గల 4900/5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటాయని తెలిసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 6.2-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, శాంసంగ్ గెలాక్సీ ఎస్24+ ఫోన్ 6.7 -అంగుళాల 120 హెర్ట్జ్ డైనమిక్ అమోలెడ్ ప్యానెల్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

