Samsung Galaxy F34-5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’.. తన గెలాక్సీ ఎఫ్34 ఫోన్ కొత్త కలర్ ‘ఆర్చిడ్ వయొలెట్’ ఆప్షన్లో మార్కెట్లో ఆవిష్కరించింది. గత ఆగస్టులో అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బ్లాక్, మైస్టిక్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా ‘ఆర్చిడ్ వయొలెట్’ కలర్ ఫోన్ ఉంటుంది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో అందుబాటులో ఉంటుందీ ఫోన్. న్యూ కలర్ ఆప్షన్లో పలు ఫీచర్లు జత కలుస్తాయని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఆప్షన్ విత్ 5ఎన్ఎం ఎక్సినోస్ 1280 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ ఫోన్.
50-మెగా పిక్సెల్ (ఓఐఎస్) నో-షేక్ కెమెరా స్పోర్ట్ ఫన్ మోడ్ (16 డిఫరెంట్ ఇన్ బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 -మెగా పిక్సెల్ హై రిజొల్యూషన్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెండు స్టోరేజీ వేరియంట్లు – 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,499, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.25,999లకు లభిస్తుంది.