Luxury Homes | ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాదే.. లగ్జరీ ఇండ్లపై మోజు
Luxury Homes | ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది.. కరోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. 97 శాతం ఇండ్ల విక్రయాలు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనే జరిగాయి.
Luxury Homes | ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది.. కరోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. విశాలమైన, వసతులతో కూడిన ఇండ్లకు ప్రాధాన్యం ఎక్కువైంది. అలాగే లగ్జరీ ఇండ్లపైనా భారతీయులు మోజు పెంచేసుకుంటున్నారని రియాల్టీ సంస్థ సీబీఆర్ఈ పేర్కొంది.
ఈ ఏడాది జనవరి -సెప్టెంబర్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. గతేడాదితో పోలిస్తే ఇండ్ల విక్రయాలు 97 శాతం పెరిగాయి. ఆ జాబితాలో ఢిల్లీ- ఎన్సీఆర్ ( దేశ రాజధాని ప్రాంతం), ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనే 90 శాతం లగ్జరీ ఇండ్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 37 శాతం, ముంబైలో 35, హైదరాబాద్‌లో, పుణెలో నాలుగు శాతం సేల్స్ నమోదయ్యాయి.
ఎకానమీ పుంజుకోవడంతోపాటు ఖర్చు చేసే ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలు పెంచుకోవాలన్న ఆకాంక్షలు ఎక్కువ కావడంతోపాటు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో లగ్జరీ ఇండ్లకు కొరత ఏర్పడటం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య లగ్జరీ ఇండ్ల విక్రయాలు మరింత పెరుగుతాయని సీబీఆర్ఈ అంచనా వేస్తున్నది. ప్రత్యేకించి ఫస్ట్ టైం లగ్జరీ ఇండ్ల కొనుగోలు దారులు పెరుగుతారని భావిస్తున్నట్లు తెలిపింది.
లగ్జరీ ఇండ్ల కొనుగోలు దారుల్లో సంపన్నులు, ఎన్నారైలు ఉన్నారు. లగ్జరీ ఇండ్ల కొనుగోలుతో సంపన్నులు, ఎన్నారైలు పెట్టుబడులను విస్తరిస్తున్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మున్ముందు లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు పెరిగే ధోరణులు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

