Rooftop solar system | మీ ఇంటి కరంట్ బిల్లు ప్రతి నెలా రూ.2500-3000 వస్తుందా.. దాన్ని రోజుకు రూ.8 చొప్పున నెలకు రూ.240కి కుదించొచ్చు. ఒకవేళ మీరు మీ ఇంటి రూఫ్ టాప్ మీద మూడు కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే చాలు. అది 25 ఏండ్ల లైఫ్ కలిగి ఉంటుంది. ఈ సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ ఖర్చు రూ.72 వేలు. దాన్ని నెలల్లోకి.. ఆ పై రోజుల్లోకి విభజిస్తే.. ఒక్కో రోజుకు రూ.8 మాత్రమే వస్తుంది.
2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేషనల్ రూఫ్‌టాప్ స్కీం’ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 23న ‘ప్రధానమంత్రి సర్వోదయ యోజన’ పథకం ప్రారంభించారు. ఈ స్కీం కింద దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్ స్టల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి రూ.1.26 లక్షలు ఖర్చవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.54 వేలు సబ్సిడీ ఇస్తుంది. అయితే సంబంధి సోలార్ ప్యానెల్ నాణ్యత, ఇతర సర్వీసుల ఆధారంగా వాటి ధరలు నిర్ణయిస్తారు.