Retail Inflation | ఆర్బీఐ అనుమానించినంత పని జరిగింది. 2021తో పోలిస్తే గత నెల రిటైల్ ద్య్రవ్యోల్బణం సరికొత్త రికార్డు నమోదు చేసింది. వంట నూనెలు, ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో గత నెల (ఏప్రిల్ 2022) చిల్లర ద్రవ్యోల్బణం ( Retail inflation ) 7.79 శాతానికి దూసుకెళ్లింది. 2014 మే తర్వాత అధిక రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా రికార్డైంది.
ద్రవ్యోల్బణం ఆరు శాతం కటాఫ్‌గా ఆర్బీఐ నిర్దేశించుకున్నది. ఈ కటాఫ్‌ను మార్క్‌ను దాటి 2022 ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఆర్థిక వేత్తల్లో ఆందోళన మొదలైంది. గత మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి చేరుకున్నది. దీనికి తోడు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో గతవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ అకస్మాత్‌గా సమావేశమై రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచింది. 2018 అక్టోబర్ తర్వాత ఆర్బీఐ రెపోరేట్ పెంచడం ఇదే తొలిసారి.