Retail Inflation | హమ్మయ్య.. దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 11 నెలల తర్వాత ఫస్ట్ టైం
Retail Inflation | గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. జనవరి తర్వాత చిల్లర ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం.
Retail Inflation | ఎట్టకేలకు రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠ స్థాయి 5.88 శాతానికి దిగి వచ్చింది. ఆహార వస్తువుల ధరలు పడిపోవడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చిందని సోమవారం కేంద్రం విడుదల చేసిన అధికారిక డేటా తెలిపింది. ఆర్బీఐ నియంత్రణ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం దిగి రావడం గత 11 నెలల్లో ఇదే తొలిసారి. దీంతో గత జనవరి నుంచి తొలిసారి ఆర్బీఐ నియంత్రణ స్థాయి (ఆరు శాతం)కి చిల్లర ద్రవ్యోల్బణం చేరుకున్నది. గత డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతంగా ఉంది. కాగా, గత అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతం కాగా, గతేడాది నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా నమోదైంది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించిన డేటా ప్రకారం నవంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 4.67 శాతంగా రికార్డైంది. గత అక్టోబర్ నెలలో ఇది 7.01 శాతంగా రికార్డు కావడం గమనార్హం. గత జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణ స్థాయిని దాటి నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గత మే నెల నుంచి ఇప్పటి వరకు ఐదు దఫాలు రెపోరేట్ పెంచేసింది ఆర్బీఐ. దీంతో ఆర్బీఐ రెపోరేట్ గత మే నుంచి 2.25 శాతం పెరిగినట్లయింది. తాజాగా గత వారం 35 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచడంతో ఆర్బీఐ రెపోరేట్ 6.25 శాతానికి చేరుకున్నది. ఇక వచ్చే 12 నెలలు కూడా ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి పైగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు గత అక్టోబర్ నెలలో నాలుగు శాతానికి పడిపోయాయి. మాన్యుఫాక్చరింగ్ ఔట్ పుట్ పతనం కావడంతోపాటు మైనింగ్ కార్యకలాపాలు, విద్యుత్ ఉత్పత్తి గ్రోత్ పడిపోయిన నేపథ్యంలో ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) గత అక్టోబర్ నెలలో 4.2 శాతానికి పడిపోయింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ఔట్ పుట్ 5.6 శాతానికి పతనమైంది. మైనింగ్ ఔట్ పుట్ 2.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం మాత్రమే పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

