Retail Inflation | మళ్లీ ధరలకు రెక్కలు.. ‘కూర’గాయల ధరలే కారణమా..?
Retail Inflation | కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నది.
Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణానికి మళ్లీ రెక్కలొచ్చాయి. 2023 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయి 5.69 శాతంగా నమోదైంది. 2023 నవంబర్‌లో 5.55 శాతం కాగా, 2022 డిసెంబర్లో 5.72 శాతంగా రికార్డైంది. ఆహార వస్తువుల ధరల వల్లే చిల్లర ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లింది. 2022 డిసెంబర్ ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 4.19 శాతం కాగా, గత నెలలో 9.53 శాతంగా, 2023 నవంబర్ లో 8.7 శాతంగా రికార్డైంది.
ఆహార వస్తువుల ధరల్లో అనిశ్చితి చిల్లర ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రోజువారీగా వినియోగించే కీలక కూరగాయల ధరల్లో పెరుగుదలతో సమీప భవిష్యత్‌లో సీపీఐ సూచీ మరింత పెరిగేందుకు సంకేతం అని అన్నారు. వేసంగి సీజన్లో విత్తుతున్న గోధుమలు, పప్పు ధాన్యాలు, మసాలా దినుసుల పరిస్థితులను పర్యవేక్సించాలని శక్తికాంత దాస్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పంచదార ధరలు పెరగడం కూడా ఆందోళనకరమేనన్నారు. వరుసగా నాలుగో నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే ఎక్కువగా నమోదైంది.
మరోవైపు, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) నవంబర్ గణాంకాలు 2.4 శాతానికి పడిపోయాయి. గతేడాది మార్చిలో నమోదైన ఐఐపీ 1.7 శాతమే. 2022 నవంబర్ నెలతో పోలిస్తే పారిక్రామిక వ్రుద్ధి నెమ్మదిగా 1.2 శాతం పెరుగుతున్నది. దుస్తులు, ఫర్నీచర్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ అండ్ ఆప్టికల్ ప్రొడక్ట్ ఇండస్టీస్లో 20 శాతానికి పైగా డీ-గ్రోత్ నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

