ఇక బయటి తిండిపై బాదుడు : ధరలు పెంచేందుకు రెస్టారెంట్లు రెడీ!
కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపేందుకు రెస్టారెంట్ల యజమానులు సిద్ధమవుతున్నారు.
ముంబై : కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపేందుకు రెస్టారెంట్ల యజమానులు సిద్ధమవుతున్నారు. కూరగాయల నుంచి ఇంధన ధరల వరకూ ధరలు మండిపోతుండటంతో ఆహార పదార్ధాలను వండివార్చడం రెస్టారెంట్ల నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారడంతో మెనూ టారిఫ్‌లపై వారు దృష్టిసారిస్తున్నారు. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 117 డాలర్లకు చేరడంతో వచ్చే వారం నుంచి ఇంధన పెంపు తప్పదని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు.
ఇంధన ధరలు పెరిగితే సరుకు రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, పప్పులు, నూనెలు సహా అన్ని వస్తువుల ధరలు ఎగబాకుతాయని దీంతో తాము తప్పక కస్టమర్లపై కొంత భారాన్ని మోపాల్సిన పరిస్ధితి ఎదురవుతుందని స్పెషాలిటీ రెస్టారెంట్స్ సీఎండీ అంజన్ ఛటర్జీ బాంబు పేల్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో వంటనూనెల ధరలూ మండిపోతున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ల ధరలు ఆయా నగరాల్లో రూ 1900 నుంచి రూ 2000 వరకూ పెరిగాయి.
పరిస్ధితి ఇలాగే ఉంటే తాము ధరలు పెంచకతప్పదని, ఇది సామాన్యుడిపై భారం మోపుతుందని భారత హోటల్స్, రెస్టారెంట్స్ సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. థర్డ్ వేవ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని తక్కువ వడ్డీరేటుతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని రెస్టారెంట్ యజమానులు కోరుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- costly
- menu
- restaurants
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

