Adani Group వివరణ.. ఇన్వెస్టర్ల ఖాతాల స్తంభన ‘పచ్చి అబద్ధం’
Adani Group వివరణ.. ఇన్వెస్టర్ల ఖాతాల స్తంభన ‘పచ్చి అబద్ధం’| తమ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐ ఖాతాలను ఎన్ఎస్డీఎల్.....

న్యూఢిల్లీ: తమ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపజేయడంపై ఆదానీ గ్రూప్ సోమవారం ప్రతిస్పందించింది. ఇది పచ్చి అబద్ధం అని రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది.
తమ గ్రూప్‌కు ఒక రిజిస్ట్రార్ ఉన్నారని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు ఎఫ్‌పీఐ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయలేదని పేర్కొన్నది.
ఆదానీ గ్రూప్‌కు చెందిన ఐదు సంస్థల్లో అబ్దుల్లా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎటువంటి కారణాలను చెప్పకుండానే ఎన్ఎస్డీఎల్ స్తంభింప చేసింది. దీంతో కొత్త సెక్యూరిటీల క్రయ విక్రయాలను ఈ సంస్థలు చేయలేవు.
ఆదానీ పవర్, ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ గ్రీన్, ఆదానీ ట్రాన్స్మిషన్, ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లు సోమవారం 25 శాతం పతనం అయ్యాయి. నిఫ్టీ-50లో లిస్టెడ్ ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేర్లు 19 శాతం పతనమై తిరిగి కొంత నష్టాలతో ముగిశాయి.
ప్రస్తుతం ఆదానీ గ్రూప్‌కు చెందిన 12 మంది అగ్రశ్రేణి ఇన్వెస్టర్లలో మూడు ఎఫ్‌పీఐ ఇన్వెస్టర్లు ఉన్నాయి. ఐదు ఆదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు గతేడాది మార్చి నుంచి పది రెట్లకు పైగా పెరిగాయి.
ఇటీవల స్టాక్ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఆసియా ఖండంలోనే రెండో కుబేరుడిగా గౌతం ఆదానీ నిలిచారు. ఆసియాలోనే మొదటి కుబేరుడిగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

