Renault Cardian | గ్లోబల్ మార్కెట్లోకి రెనాల్ట్ న్యూకంపాక్ట్ ఎస్యూవీ కార్డియన్ ఆవిష్కరణ..!
Renault Cardian | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి న్యూ కంపాక్ట్ ఎస్యూవీ కారు ‘కార్డియన్ (Cardian)’ ఆవిష్కరించింది.
Renault Cardian | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి న్యూ కంపాక్ట్ ఎస్యూవీ కారు ‘కార్డియన్ (Cardian)’ ఆవిష్కరించింది. 13కి పైగా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో కూడిన సేఫ్టీ ఫీచర్లతో వస్తోందీ కారు. రెనాల్ట్ కైగర్ తర్వాత ఈ సంస్థ నుంచి మార్కెట్లో ఆవిష్కరించిన బుల్లి ఎస్యూవీ కారు ఇదే.
ఫియట్ పల్స్‌తోపాటు టాటా పంచ్, నిసాన్ మ్యాగ్నైట్ వంటి కార్లతో పోటీ పడుతుందీ రెనాల్ట్ కార్డియన్. కంపెనీ సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫామ్ ‘సాండెరో స్టెప్‌వే’పై నిర్మించారు. సాండెరో నుంచి బాడీ ప్యానెల్స్, ఇంజిన్, డిజైన్ ఎలిమెంట్స్ వినియోగించారు.
రెనాల్ట్ కార్డియన్ కారు డబుల్ లేయర్ గ్రిల్లె, లాంగ్ బంపర్, ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం స్కిడ్ ప్లేట్, ఫ్రంట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. కూపే-ఎస్యూవీ తరహా బాడీ షెల్, వీల్ ఆర్చెస్ పై బాడీ క్లాడింగ్, రన్నింగ్ బోర్డ్స్‌తో ఈ కారును స్ట్రాంగ్ ఎస్‌యూవీగా నిలుపుతాయి. కైగర్ తరహాలో సీ-షేప్డ్ డిజైన్‌తోపాటు టెయిల్ ల్యాంప్ వస్తుంది. టాప్ హై ఎండ్ వేరియంట్లలో స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ ఆంటీనా, అడిషనల్ క్రోమ్ బిట్స్ ఉంటాయి.
ఇతర రెనాల్ట్ ఎస్యూవీ కార్ల మాదిరే 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్, 4-స్పోక్ స్టీరింగ్ వీల్, వేరియంట్‌ను బట్టి వుడ్ ఇన్సర్ట్స్, ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియంతో పియానో బ్లాక్ తదితర ఫీచర్లు జత చేశారు.
రెనాల్ట్ కార్డియన్ 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 125 హెచ్‌పీ విద్యుత్, 220 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

