Reliance Jio | జియో ఇండిపెండెంట్ డే ఆఫర్.. రూ.2999 ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో ఇవీ డిటైల్స్.. !
Reliance Jio | రిలయన్స్ జియో తన ప్రీ-పెయిడ్ యూజర్లకు కొత్త ఇండిపెండెంట్ ఆఫర్లు తెచ్చింది. 356 రోజుల వ్యాలిడిటీతో రూ.2,999, 336 రోజుల వ్యాలిడిటీతో 336 రోజులు, రూ.349 వ్యాలిడిటీతో 30 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్లు వచ్చాయి. ఇంకా జియో యాప్స్ ఉచితంగా పొందొచ్చు.
Reliance Jio | రిలయన్స్ జియో తన యూజర్లకు స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.2,999 చెల్లిస్తే రోజువారీగా 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్లు పొందొచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.2,999 ప్రీ-పెయిడ్ ఇండిపెండెన్స్ ఆఫర్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటది. రూ.249తో స్విగ్గీ ఆర్డర్ పెడితే రూ.2,999 ప్రీ-పెయిడ్ ప్లాన్‌లో రూ.100 తగ్గుతుంది. ఇక రూ.2,545లతో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కూడా తెచ్చింది.
రిలయన్స్ జియో వెబ్సైట్ వెల్లడించిన వివరాల మేరకు రూ.2,999 ప్లాన్ కింద 365 రోజులూ.. డైలీ 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ ఉచితంగా పొందడంతోపాటు 5జీ డేటా అపరిమితంగా అందుకోవచ్చు.
రూ.249 స్విగ్గీ ఆర్డర్ చేస్తే.. రూ.2999 ప్లాన్‌లో రూ.100 మాఫీ, యాత్ర వెబ్సైట్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1500 వరకు, అజియోలో సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ రూ.999 పై చిలుకు వస్తువులు కొనుగోలు చేస్తే రూ.200 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా నెట్ మెడ్స్ లో ఆర్డర్లపై 20 శాతం రాయితీ అందుకోవచ్చు.
336 రోజుల వ్యాలిడిటీ గల రూ.2,545 ప్రీ పెయిడ్ ప్లాన్ కింద ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్హత గల సబ్ స్క్రైబర్లకు అపరిమిత 5జీ డేటా ఉచితం.
రూ.2,999లకు 365 రోజులు, రూ.2545 లకు 336 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్ల కంటే చౌకగా రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది కేవలం 30 రోజుల వ్యాలిడిటీ మాత్రమే కలిగి ఉంటుంది. 75 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. డేటా పరిమితి దాటితే 64 కేబీపీఎస్ స్పీడ్ తో డేటా లభిస్తుంది.
ఆసక్తి గల రిలయన్స్ జియో సబ్స్క్రైబర్లు.. మై జియో యాప్, జియో వెబ్ సైట్ తోపాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర మొబైల్ యాప్స్ ద్వారా ఈ ప్లాన్ల కింద రీచార్జి చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

