Jio Financial | త్వరలో స్టాక్ మార్కెట్లలో `జియో` లిస్టింగ్..?!.. ఈషా అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Jio Financial | రిలయన్స్ అనుబంధ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్ మెంట్స్.. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ త్వరలో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానుంది. ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ ఆ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Jio Financial | జియో (Jio) త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి సిద్ధమవుతున్నది. `జియో` ఫైనాన్సియల్ సర్వీసెస్ (JFSL)` పేరుతో ఐపీఓకు వెళ్లనున్నది. అందుకోసం ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ (Reliance) కీలక నిర్ణయం తీసుకున్నది.
తన ఆధీనంలోని ఆర్థిక వ్యవహారాల సంస్థ రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్మెంట్స్ (Reliance Strategic Investments) ను రిలయన్స్ డీ మెర్జర్ చేసింది. డీమెర్జర్ తర్వాత రిలయన్స్.. `జియో` ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services- JFSL) పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 20న రిలయన్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అలియాస్ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (JFSL) డీమెర్జర్ ప్రక్రియ పూర్తవుతుందని రిలయన్స్ శనివారం ప్రకటించడమే దీనికి కారణమని తెలుస్తున్నది.
రిలయన్స్‌లో రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్మెంట్స్ డీమెర్జర్‌కు గత నెలలో రెగ్యులేటరీ అప్రూవల్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్మెంట్స్ డీ మెర్జర్ తేదీ ఖరారు చేసింది. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్ కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్ మెంట్స్ అలియాస్ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈఓ కం ఎండీగా కూడా నియమించింది. ఇదే కంపెనీలో ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకాలను ఆర్బీఐ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్మెంట్స్ డీ మెర్జర్ ద్వారా 36 లక్షల వాటాదారుల స్టాక్ విలువ అన్ లాక్ అవుతుంది. ఇందులో భాగంగా జియో ఫైనాన్సియల్లో ఒక షేర్.. రిలయన్స్ వాటాదారులకు లభిస్తుంది. మూడు నెలలుగా రిలయన్స్ షేర్ 13 శాతం పెరిగి శుక్రవారం స్వల్పంగా తగ్గినా రూ.2635.45 వద్ద స్థిర పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

