Signature Bank Closed | ఎస్వీబీ బాటలోనే మరో బ్యాంక్.. సిగ్నేచర్ బ్యాంకు మూసివేత
Signature Bank Closed | ఎస్వీబీ పతనం ప్రకంపనలు కొనసాగుతుండగానే మూడోవంతు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంకును మూసేస్తున్నట్లు అమెరికా రెగ్యులేటర్లు ప్రకటించారు.
Signature Bank Closed | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) సంక్షోభం సమసిపోకముందే అమెరికాలో మరో బ్యాంకు సిగ్నేచర్ బ్యాంక్ (Signature Bank) మూత పడింది. సిగ్నేచర్ బ్యాంకులో ఎక్కువగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలే జరుగుతుండటం గమనార్హం. క్రిప్టో కరెన్సీ పరిశ్రమతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతుండటంతో సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసేశామని అమెరికా నియంత్రణ సంస్థలు ఆదివారం వెల్లడించాయి. కేవలం రెండు రోజుల్లోనే అమెరికాలోని రెండు ప్రధాన బ్యాంకులు మూత పడటంతో బ్యాంకింగ్ రంగ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌డీఐసీ నియంత్రణలోకి సిగ్నేచర్ బ్యాంక్
సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత నిర్ణయాన్ని అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్ ప్రకటించడమే తరువాయి దాని నియంత్రణను యూఎస్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (యూఎస్ ఎఫ్‌డీఐసీ) తీసేసుకున్నది. 2022 డిసెంబర్ నెలాఖరు నాటికి సిగ్నేచర్ బ్యాంకుకు 110.36 బిలియన డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి.
బ్రిడ్జి బ్యాంకు ద్వారా సిగ్నేచర్ బ్యాంకు డిపాజిట్ల విత్ డ్రాయల్స్
సిగ్నేచర్ బ్యాంకులో డిపాజిటర్లు తమ సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని ఎఫ్‌డీఐసీ వెల్లడించింది. అటువంటి వారి కోసం తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ బ్రిడ్జి బ్యాంకు ద్వారా డిపాజిటర్లు, ఇతర కస్టమర్లు తమ నిధులు పొందవచ్చునని వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి బ్యాంకుకు గ్రేగ్ కార్మికేల్ అనే బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌ని సీఈవోగా నియమించింది యూఎస్ ఎఫ్‌డీఐసీ.
తొమ్మిది విభాగాల్లో ఎస్వీబీ సేవలు
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న వాణిజ్య బ్యాంక్ సిగ్నేచర్ బ్యాంక్.. స్థిరాస్తి, డిజిటల్ ఆస్తుల బ్యాంకింగ్‌తోపాటు మొత్తం తొమ్మిది విభాగాలలో కస్టమర్లకు సేవలు అందిస్తున్నది. గతేడాది సెప్టెంబర్ నాటికి బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో కరెన్సీ పరిశ్రమ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఈ క్రిప్టో కరెన్సీ డిపాజిట్లను త్వరలో ఎనిమిది బిలియన్ డాలర్లకు కుదిస్తామని 2022 డిసెంబర్లో వెల్లడించింది సిగ్నేచర్ బ్యాంక్.
సిగ్నేచర్బ్యాంక్ సీఈవోగా ఎరిక్ హొవెల్
గత నెలలోనే ప్రస్తుత బ్యాంక్ సీఈవో జోసెఫ్ డీపావోలో సీనియర్ అడ్వైజర్‌గా మారతారని బయటపెట్టింది. ఆయన స్థానంలో ప్రస్తుత సీవోవో ఎరిక్ హొవెల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. 2001 నుంచి బ్యాంక్ సీఈవో కం అధ్యక్షుడిగా డీపావోలో వ్యవహరిస్తున్నారు.
చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరికలు
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకుల పతనానికి కారకులపై చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. డిపాజిటర్ల సొమ్ము సురక్షితం అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికే సిగ్నేచర్ బ్యాంకుపై చర్యలు తీసుకున్నట్లు యూఎస్ ఫెడ్ రిజర్వు వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

