Redmi Note 13+ | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ త్వరలో తన రెడ్మీ నోట్ 13+ ఫోన్ ఆవిష్కరించనున్నది. గతేడాది డిసెంబర్లో తెచ్చిన రెడ్మీ నోట్12, రెడ్మీ నోట్12 ప్రో, రెడ్మీ నోట్12 ప్రో+ ఫోన్లకు కొనసాగింపుగా రెడ్మీ నోట్13 సిరీస్ ఫోన్లు తీసుకొస్తున్నది.
రెడ్మీ నోట్13+ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. 200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ2బీ10 సెన్సర్ విత్ డెప్త్ ఆర్ మాక్రో లెన్స్ సెన్సర్ కెమెరాలు, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ16ఏ1క్యూ ఫ్రంట్ కెమెరా సెన్సర్ వస్తుందని భావిస్తున్నారు.
రెడ్మీ నోట్13 సిరీస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + చిప్ సెట్ వస్తుందని భావిస్తున్నారు. హై ఎండ్ మోడల్ ఫోన్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్ అండ్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుందని చెబుతున్నారు. 120వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది.