Redmi Note 13 | అద్భుతమైన కెమెరా సెన్సర్లతో బడ్జెట్ ధరలోనే రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు. .ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Redmi Note 13 Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ తన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. అద్భుతమైన కెమెరా సెన్సర్లతో కూడిన ఈ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
Redmi Note 13 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ సెగ్మెంట్లో తన రెడ్మీ నోట్ 13 (Redmi Note 13) సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. వాటిలో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో + ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే, భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్నది వెల్లడించలేదు.
రెడ్మీ నోట్ 13 ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ సుమారు రూ.13,900 (1199 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,100 (1299 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.17,400 (1499 చైనా యువాన్లు) పలుకుతుంది. టాప్ హై ఎండ్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.19,700 (1699 చైనా యువాన్లు) పలుకుతుంది.
మరోవైపు రెడ్మీ నోట్ 13 ప్రో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.17,400 (1499 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.19,700 (1699 చైనా యువాన్లు)లకు లభిస్తుంది. ఇక 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ సుమారు రూ.22 వేలు (1899 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.23,100 (1999 చైనా యువాన్లు) పలుకుతుంది. టాప్ హై ఎండ్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,300 (1699 చైనా యువాన్లు)లకు పొందొచ్చు.
రెడ్మీ నోట్ 13 ప్రో + ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సరాసరి రూ.22,800 (1999 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.25,100 (2199 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.26,200 (2299 చైనా యువాన్లు)లకు లభిస్తుంది.
రెడ్మీ నోట్ 13 స్పెషిఫికేషన్స్..
రెడ్మీ నోట్ 13 బేస్ మోడల్ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో, ప్రో మోడల్ బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్ షేడ్స్, ప్రో+ మోడల్ ఫోన్ బ్లాక్ సిల్వర్, వైట్ కలర్స్‌లో పొందొచ్చు. రెడ్ మీ నోట్ 13 ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్ పై పని చేస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్న రెడ్మీ నోట్ 13 ఫోన్ లో 100 -మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుంది. 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో ఫీచర్లు ఇవే..
రెడ్మీ నోట్ 13 ప్రో ఫోన్ 6.67-అంగుళాల 1.5 కే ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్ కలిగి ఉంటది.
200-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది.
రెడ్మీ నోట్ 13 ప్రో+ ఫోన్ లోనూ ప్రో మోడల్ ఫోన్లోని ఫీచర్లే ఉంటాయి. అదనంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

