Redmi 14C 5G | జనవరి 6న భారత్ మార్కెట్లో రెడ్మీ 14సీ 5జీ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Redmi 14C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Redmi 14C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది. ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటాయి. రెడ్మీ కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లో ఈ ఫోన్ లభ్యం అవుతుంది.
రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. 6.88 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ రూ.12 వేల లోపు ధరకే లభిస్తుందని భావిస్తున్నారు. ఇంకా రెడ్మీ తన రెడ్మీ 14సీ 5జీ ఫోన్ ధర వివరాలు వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

