Redmi 12C | భారత్ మార్కెట్లోకి షియోమీ ఎంట్రీ లెవెల్ ఫోన్ రెడ్మీ 12సీ.. రూ.8999లకే లభ్యం.
Redmi 12C | భారత్ మార్కెట్లోకి షియోమీ మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 12సీ ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.8999 నుంచి మొదలవుతుంది.
Redmi 12C | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ.. భారత్ మార్కెట్లో మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. న్యూ రెడ్ మీ 12సీ ఫోన్ పేరిట మార్కెట్లోకి తెచ్చింది. దీంతోపాటు 4జీ వేరియంట్ రెడ్మీ 12 నోట్ ఫోన్ కూడా ఆవిష్కరించింది. రెడ్మీ 12 సీ ఫోన్ స్టయిలిష్ డిజైన్‌తో మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్‌తో వస్తున్నది.
రెడ్ మీ 12 సీ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఫోన్ రూ.8,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.10,999లకే లభిస్తుంది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.500 రాయితీ లభిస్తుంది.అంటే ఆ బ్యాంకు కార్డులపై 4జీబీ రామ్ ఫోన్ రూ.8499, 6జీబీ రామ్ ఫోన్ రూ.10,499లకు లభిస్తాయి.
అమెజాన్ డాట్‌కామ్, ఎంఐ డాట్ కాం, ఎంఐ స్టూడియో, ఎంఐ హోమ్, ఆథరైజ్డ్ రిటైల్ షాపుల్లో వచ్చేనెల ఆరో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
రెడ్ మీ సీ నాలుగు రంగులు లావెండర పర్పుల్, మింట్ గ్రీన్, రాయల్ బ్లూ, మ్యాటె బ్లాక్ వర్షన్లలో లభిస్తుంది.
ఇవీ కీలక ఫీచర్లు
రెడ్ మీ 12సీ ఫోన్ 6.71-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ 120 హెర్ట్ టచ్ శాంప్లింగ్ రేట్
ఎంట్రీ లెవెల్ మీడియా టెక్ హేలియో జీ85 ఒక్టాకోర్ చిప్ సెట్ సపోర్ట్స్ క్లాక్ స్పీడ్ అప్టూ 12 గిగా హెర్ట్.
హైపర్ గేమింగ్ టెక్నాలజీ, ఆర్మ్ మాలీ-జీ52 ఎంసీ2 జీపీయూ టెక్నాలజీ కలిగి ఉంటుంది.
6జీబీ రామ్‌తోపాటు 5జీబీ వర్చువల్ విస్తరణకు, మైక్రో ఎస్డీ కార్డుతో ఒక టిగా బైట్ వరకు విస్తరణ వెసులుబాటు.
50మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ అండ్ సపోర్ట్స్ హెచ్డీఆర్. ఐపీ52 రేటెడ్ స్పాష్ రెసిస్టెన్స్.
రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ విత్ ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫర్ సెక్యూరిటీ, కనెక్టివిటీకి డ్యుయల్ వై-ఫై సపోర్ట్ 2+1 కార్డ్ స్లాట్.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

