హైదరాబాద్, మార్చి 3: ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో 50 అత్యంత ఇన్నోవేటివ్ సంస్థలతో విడుదలైన ఫాస్ట్ కంపెనీ వార్షిక జాబితాలో రీసైకల్ చోటు దక్కించుకున్నది. ఈ ఏడాదికిగాను ప్రకటించిన ఈ ప్రతిష్ఠాత్మక లిస్టులో రీసైకల్ నాల్గో స్థానంలో నిలిచింది. 54 రంగాల్లోని 540 సంస్థలను పరిశీలించి 50 కంపెనీలతో ఈ తుది జాబితాను ఫాస్ట్ కంపెనీ రూపొందించడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన రీసైకల్.. ఓ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యర్థాల నిర్వహణ స్టార్టప్. ఈ రీసైకల్ వేదిక ద్వారా ప్లాస్టిక్, ఈ-వేస్ట్, పేపర్, మెటల్ క్రయవిక్రయాలు జరుగుతాయి. దీంతో ఆసియాలోనే అతిపెద్ద సర్క్యులర్ ఎకానమీ మార్కెట్‌ప్లేస్‌గా రీసైకల్ గుర్తింపును పొందింది.