Realme Narzo N65 5G | 28న భారత్ మార్కెట్లోకి రియల్మీ నార్జో ఎన్65 5జీ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్65 5జీ ఫోన్‌ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్65 5జీ ఫోన్‌ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. లార్జ్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్తో వస్తున్న ఈ ఫోన్ ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్ సెట్, ఐపీ 54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ – కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో సేల్స్ ప్రారంభం అవుతాయి.
గత నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ ఫోన్ లోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ చిప్ సెట్ వాడారు. రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499 పలుకుతుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా, 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. గ్లోషీ ఫినిష్ తోపాటు గోల్డెన్ కలర్ ఆప్షన్ తో వస్తున్న ఈ ఫోన్ లో రెండు కెమెరా సెన్సర్లు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటాయి. బ్యాక్ ప్యానెల్ మీద లార్జ్ సర్క్యులర్ కెమెరా యూనిట్ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

