Realme Narzo N61 | రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో ఎన్61.. ఇవీ డీటెయిల్స్..!
Realme Narzo N61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme Narzo N61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో ఆగస్టులో విక్రయాలు ప్రారంభం అవుతాయి.
రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు లభిస్తాయి. ఆగస్టు ఆరో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ఫస్ట్ సేల్ లో పాల్గొనే కొనుగోలుదారులకు రూ.500 డిస్కౌంట్ కూపన్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్, రియల్మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. మార్బుల్ బ్లాక్, వోయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ+ (1600×720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆర్మూర్ షెల్ ప్రొటెక్షన్, టీయూవీ రైన్ లాండ్ హై రిలయబిలిటీ సర్టిఫికెట్ కలిగి ఉంటుంది. తడి చేతులతోనూ ఫోన్ వాడేందుకు రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ కూడా వినియోగించారు. రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్ తో వస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది. 6జీబీ ర్యామ్ ను 12 జీబీ ర్యామ్ కు విస్తరించొచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగాబైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్ 32-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సమగ్ర నోటిఫికేషన్లు, అలర్ట్స్ కోసం మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ కూడా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఫుల్ చార్జింగ్ తో 30 గంటల వరకూ వాయిస్ కాల్ టైం ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

