Realme 11 Pro 5G | నేడు భారతీయ మార్కెట్లోకి రియల్మీ 11 ప్రో 5జీ సిరీస్ మొబైల్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన సరికొత్త రియల్మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను నేడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. రియల్మీ 11 ప్రొ (Realme 11 Pro 5G), రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G) మోడళ్లను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నది.
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన సరికొత్త రియల్మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను నేడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. రియల్మీ 11 ప్రొ (Realme 11 Pro 5G), రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G) మోడళ్లను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నది. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ ఫోన్లను చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. లాంచింగ్ సందర్భంగా ప్రీ ఆర్డర్లతోపాటు లాంచింగ్ ఆఫర్ కూడా అందిస్తున్నది. వీటిలో 6.7 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, 1 టీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్మీ 11 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, 100 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక రియల్మీ 11 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
రియల్ మీ 11 ప్రో 5జీ, రియల్ మీ 11 ప్రో+ 5జీ ఫోన్లు 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) కర్వ్డ్ డిస్ ప్లేస్ విత్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటుంది. రెండు ఫోన్లలోనూ 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు రియల్ మీ 11 ప్రో విత్ 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్, రియల్ మీ 11 ప్రో + 5జీ ఫోన్ 100 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్రో+ మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్కు, ప్రో మోడల్ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ రియల్మీ 11 ప్రో 5జీ సిరీస్ మొబైళ్లకు ఉన్నాయి. రియల్మీ వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

