Realme C53 | ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. భారతీయ స్మార్ట్ ఫోన్ ప్రేమికుల కోసం బడ్జెట్ ధరకే మరో స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నది. ఈ నెల 19న భారత్ మార్కెట్లో తన ‘రియల్మీ సీ53 (Realme C53)’ ఫోన్ ఆవిష్కరిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఫోన్ ఆవిష్కరణ జరుగుతుంది. ఇంతకుముందు మలేషియాలో విడుదల చేసిన రియల్మీ సీ53 ఫోన్.. మలేషియాలో 599 ఎంవైఆర్.. భారత కరెన్సీలో రూ.10,700 పలుకుతుంది. కానీ, భారత్ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే లభించవచ్చు. 91 మొబైల్స్ డాట్ కామ్ కథనం ప్రకారం రూ.9,790లకే రియల్ మీ సీ53 ఫోన్ లభిస్తుందని సమాచారం. అధికారికంగా ఫోన్ ధర ఎంత అన్నది రియల్మీ ప్రకటించాల్సి ఉంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మలేషియాలో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా సెటప్ తో ఇటీవల విడుదల చేసింది. భారత్ లో విడుదల చేయనున్న రియల్ మీ సీ53 ఫోన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో రియల్ మీ సీ53 ఫోన్ మార్కెట్లోకి రావచ్చునని అంచనా.
మలేషియాలో 6.74 అంగుళాల డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.. 650 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఒక్టాకోర్ ఎస్వోసీ చిప్ సెట్, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్, 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగా బైట్ల వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్ మీ యూఐ టీ ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది.
రియల్ మీ సీ53 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూ టూత్ వీ 5.0 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. చాంపియన్ గోల్డ్, మైటీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బయో అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.