Realme 12+ 5G | ఆరో తేదీన బడ్జెట్ ధరలో రియల్మీ 12+ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme 12+ 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ12 + 5జీ ఫోన్‌ను ఈ నెల ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme 12+ 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్‌ను ఈ నెల ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్, ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ స్క్రీన్‌తో వస్తున్న రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్ శుక్రవారం మలేషియా, ఇండోనేషియాల్లో ఆవిష్కరించారు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న రియల్మీ12 + 5జీ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G)తోపాటు రియల్మీ12 ప్రో 5జీ (Realme 12+ Pro 5G), రియల్మీ12 ప్రో+ 5జీ (Realme 12 Pro + 5G) ఫోన్లనూ ఆవిష్కరిస్తారు.
నేవిగేటర్ బైజ్, పయనీర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.22,200, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.26,200 పలుకుతుంది. రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్ 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ (2400×1080 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్ ఏఆర్ఎం మాలీ జీ-68 ఎంసీ4 జీపీయూ, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5.0 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తాయి.
రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్.. 50 -మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఏఐ బ్యాక్డ్ 16 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది. రియల్మీ12 + 5జీ (Realme 12+ 5G) ఫోన్ 67వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. 5జీ, జీపీఎస్, బైదూ, గాలిలియో, క్యూజడ్ఎస్ఎస్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

