Realme 12+ 5G | త్వరలో దేశీయ మార్కెట్లోకి రియల్ మీ 12+5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Realme 12+ 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 12+ 5జీ (Realme 12+ 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Realme 12+ 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 12+ 5జీ (Realme 12+ 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది. రియల్మీ 12ప్రో 5జీ, రియల్మీ12 ప్రో+ 5జీ ఫోన్లను గత నెలలోనే భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రియల్మీ 12+ 5జీ ఫోన్‌తోపాటు రియల్మీ 12 5జీ ఫోన్ కూడా ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ఈ నెలాఖరులో మలేషియా మార్కెట్లో రియల్మీ 12+ 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారని సమాచారం.

రియల్మీ 12+ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 1800×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ ఔటాఫ్ ది బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 షూటర్ విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

