RERA | బిల్డాక్స్తో తస్మాత్ జాగ్రత్త.. ఆ ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న రెరా
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డాక్స్తో తస్మాత్ జాగ్రత్త అని రెరా హెచ్చరించింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టుకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని రెరా ఒక ప్రకటనలో హెచ్చరించింది.
RERA | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డాక్స్తో తస్మాత్ జాగ్రత్త అని రెరా హెచ్చరించింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టుకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని రెరా ఒక ప్రకటనలో హెచ్చరించింది.
ఇలాంటి ప్రాజెక్టులలో కొనుగోళ్లు జరపకూడదని హెచ్చరించింది. ఒక్క ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయాలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని వివరించింది. బిల్డాక్స్ సంస్థ హఫీజ్‌పేటలోని సర్వే నంబర్ 80లో గల స్థలంలో ప్లాట్లలో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు దరఖాస్తుదారు ఫిర్యాదు మేరకు ఈ నెల 6,7 తేదిల్లో బిల్డాక్స్ ప్రతినిధులు, ఫిర్యాదుదారులను రెరా అధికారులు విచారించారు.
ఈ ఆరోపణలు నిరాధారమైనవని కంపెనీ ప్రతినిధులు వెల్లడించగా..ఫిర్యాదుదారుడు మాత్రం కొండాపూర్‌లోని హఫీజ్‌పేటలో గల బిల్డాక్స్ కంపెనీలో తాను కొనుగోలు చేసిన రశీదును సమర్పించినట్లు రెరా ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం భువి, వాసవి బురిడాక్స్ ప్రాజెక్టు పేరుతో మాత్రమే గుండ్లపోచంపల్లి(సర్వే నంబర్ 509/పీఏఆర్డీ)లో పీవో 2200007044 నంబర్‌తో రెరా రిజిస్ట్రేషన్ కలిగివున్నది. ఇతర ప్రాంతాల్లో కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని, ఆ ప్రాజెక్టులలో ఎలాంటి కొనుగోలు చేయవద్దని రెరా కార్యదర్శి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

