Paytm | ఆర్బీఐ ఆంక్షలతో కష్టాల్లో పేటీఎం.. రెండు సెషన్లలో ఎం-క్యాప్ ఎంత నష్టపోయిందంటే..?!
Paytm | మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారులు, వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించవద్దని పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఆర్బీఐ ఆదేశించింది. దీంతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది.
Paytm | ఒకప్పుడు ఫిన్టెక్ సంస్థగా సేవలు ప్రారంభించిన పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకున్నది. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank Ltd)పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
‘2024 ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దు. వినియోగదారుల ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు, తదితర కార్డులు, ఖాతా దారులతో ఎటువంటి క్రెడిట్ లావాదేవీలు గానీ, టాపప్ రుణాల మంజూరు ప్రక్రియ ఈ నెలాఖరు తర్వాత చేయరాదు’ అని ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) లావాదేవీలపై బయటి ఆడిటర్లు సమర్పించిన పూర్తిస్థాయి ఆడిట్ నివేదికతోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని తేలినందునే సంస్థపై మరింత పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో దాని పేరెంట్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) షేర్ గత గురు, శుక్రవారాల్లో 40 శాతం నష్టపోయింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,378.41 కోట్ల నష్టంతో రూ.30,931.59 కోట్లకు పతనమైంది. 2021లో ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయినప్పటి నుంచి పేటీఎం షేర్ 77 శాతం పతనమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

