Crop Loan | అన్నదాతకు తీపి కబురు.. వచ్చే నెల నుంచి తాకట్టు లేకుండా రూ.2లక్షల లోన్ మంజూరు..!
Crop Loan | అన్నదాతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచేసింది.
Crop Loan | అన్నదాతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచేసింది. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకూ పంట రుణం తీసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు పంటల సాగు వ్యయం భారం కాకుండా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరపతి సౌకర్యం మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. తాజా నిర్ణయం వల్ల 86 శాతం మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది.
తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు పంట రుణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు అన్నదాతల్లో అవగాహన కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. తాజాగా కేంద్రీయ బ్యాంకు నిర్ణయం వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రుణ సౌకర్యం తేలిక కావడంతోపాటు గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ కింద సరసమైన వడ్డీరేట్లపై రూ.3-4 లక్షల వరకూ రుణం పొందొచ్చు. 2004లో ఎటువంటి తాకట్టు లేకుండా రూ.10 వేల రుణం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, క్రమంగా ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. కింది స్థాయిలో బ్యాంకులు మాత్రం తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదు. దీనివల్ల పంటల సాగు కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చిక్కుల్లో పడుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

