CBDC-RBI | డిజిటల్ రూపీ ఫలితాలు ఆశాజనకం.. ప్రయోగాలు విస్తరిస్తున్న ఆర్బీఐ
CBDC-RBI | డిజిటల్ రూపీపై ప్రయోగాలు ఆశాజనకం అని, ఆ ప్రయోగాత్మక పరీక్షలను విస్తరిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.
CBDC-RBI | డిజిటల్ రూపీ ప్రయోగాత్మక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా పిలిచే ఈ-రూపీపై ప్రయోగాలను విస్తరిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్ ఒకటో తేదీన హోల్‌సేల్ విక్రయాల్లో, డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిజిటల్ రూపీ ప్రయోగాలు ఆర్బీఐ ప్రారంభించింది.
తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ-రూపీ వినియోగం తీరును ఆర్బీఐ పరీక్షించింది. సెలెక్టెడ్ కస్టమర్లు, వ్యాపారుల మధ్య వినియోగించారు. తదుపరి అహ్మదాబాద్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, కోచి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాల్లోనూ ఈ ప్రయోగాలు ప్రారంభిస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది.
తొలుత ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుతో డిజిటల్ రూపీ ప్రయోగాలను ఆర్బీఐ ప్రారంభించింది. అటుపై బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పరీక్షించారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల్లో ఈ-రూపీ వాడకం పరీక్షిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

