RBI | వడ్డీరేట్లు యథాతథమేనా..? నేటి నుంచి ఆర్బీఐ ద్రవ్యసమీక్ష
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
- 8న నిర్ణయాలను ప్రకటించనున్న గవర్నర్ దాస్
ముంబై, డిసెంబర్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతం వద్ద ఉన్నది. కరోనా సమయంలో దిగాలుపడిన వృద్ధిరేటును ఉత్సాహపర్చేందుకు రెపోను ఆర్బీఐ బాగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం ఎగిసి పడుతుండటంతో వరుసగా రెపోను పెంచుతూపోయిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే 250 బేసిస్ పాయింట్లు (2.5 శాతం) రెపో రేటు పెరిగింది. అయితే గతకొన్ని సమీక్షల నుంచి వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తున్నాయి. ఈసారీ అదేబాటలో ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు వెళ్తారన్న ఊహాగానాలైతే బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వరుసగా ఐదోసారి వడ్డీరేట్లు యథాతథంగానే ఉండనున్నాయి.
రుణగ్రహీతలపై భారం
కరోనా టైంలో వడ్డీరేట్లను ఆర్బీఐ భారీగా తగ్గించడాన్ని చూసినవారిలో చాలామంది గృహ, వాహన ఇతరత్రా రుణాలను తీసుకున్నారు. అయితే ఇప్పుడా రుణాలపై వడ్డీరేట్లు కరోనాకు ముందున్న స్థాయికి చేరుకున్నాయి. దీంతో రుణగ్రహీతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా వడ్డీరేట్లను సవరించే విధానమున్న లోన్లు కావడంతో రెపో పెరిగినప్పుడల్లా బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లనూ పెంచుతూపోతున్నాయి. ఫలితంగా అప్పులు తీసుకున్నవారిపై మోయలేనంత భారం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈసారైనా వడ్డీరేట్లు తగ్గుతాయా? అన్న ఆశతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ ఏం చేస్తుందో చూడాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

