Bajaj Finance | బజాజ్ ఫైనాన్స్‌కు షాకిచ్చిన ఆర్బీఐ..! లోన్లపై బ్యాన్ విధింపు..!
Bajaj Finance | బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెండు లెండింగ్ ప్రొడక్టులపై లోన్లు ఇవ్వొద్దని బుధవారం ఆదేశించింది. బజాజ్ లెండింగ్ ఉత్పత్తులైన Ecom, Insta EMI కార్డ్‌ల కింద లోన్ల జారీని వెంటనే నిలిపివేయాలని చెప్పింది.
Bajaj Finance | బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెండు లెండింగ్ ప్రొడక్టులపై లోన్లు ఇవ్వొద్దని బుధవారం ఆదేశించింది. బజాజ్ లెండింగ్ ఉత్పత్తులైన Ecom, Insta EMI కార్డ్‌ల కింద లోన్ల జారీని వెంటనే నిలిపివేయాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. బజాజ్ కంపెనీ ఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ లోన్ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది.
ఈ రెండు ప్రొడక్టుల గురించి కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ వాస్తవ ప్రకటనలను జారీ చేయలేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రకటలు విడుదల చేయకపోవడం, కీలక లోపాలు రెండు ప్రొడక్టుల కింద జరిగాయని.. ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోక తప్పలేదని పేర్కొంది. కంపెనీ ఆమోదించిన ఇతర డిజిటల్ రుణాలకు సంబంధించి వాస్తవ ప్రకటనలు జారీ చేసినట్లు తెలిపింది. ఆర్బీఐ పేర్కొన్న లోపాలను సరిదిద్దిన తర్వాత సంతృప్తి పొందితే పరిమితులను సమీక్షిస్తామని స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

