Anand Mahindra | రాజస్థాన్ లో లిథియం నిల్వలు.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారు..?!
Anand Mahindra | రాజస్థాన్ లో లిథియం నిల్వలను వినియోగంలోకి తేవడానికి వాటి రిఫైనింగ్ వసతులు శరవేగంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
Anand Mahindra | లిథియం రిజర్వు నిల్వలు.. ఇటీవలే జమ్ముకశ్మీర్లో ఉన్నాయని జాతీయ జియాలజికల్ సర్వే నిపుణులు తేల్చారు. కానీ, తాజాగా రాజస్థాన్ లోని డెగానాలో లిథియం నిల్వలు ఉన్నాయని తేలింది. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిథియం నిల్వలను వినియోగంలోకి తేవాలంటే సప్లయ్ చైన్, రిఫైనింగ్ వసతులు ముఖ్యం అని స్పష్టం చేశారు. లిథియం నిల్వల రిఫైనింగ్ వసతుల్లో చైనా చాలా ముందు ఉందన్నారు. మనదేశంలో లిథియం నిల్వల రిఫైనింగ్ వసతుల కల్పనకు శరవేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
21వ శతాబ్ధిలో డెవలప్మెంట్కు మన వద్ద భారీ సహజ వనరుల నిల్వలు ఉన్నాయని అన్నారు ఆనంద్ మహీంద్రా. భవిష్యత్ భారత్ విద్యుద్ధీకరణకు ఇది సంకేతం అని అభిప్రాయ పడ్డారు. జమ్ముకశ్మీర్ లోని రేయాసీ జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నాయని తేలడంతో భారత్కు ఉజ్వల భవిష్యత్ ఉందనడంలో సందేహం లేదన్నారు.
అధికారికంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటన చేయకున్నా.. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం రాజస్థాన్ లో గల లిథియం నిల్వలు.. ఇండియా 80 శాతం అవసరాలు తీరుస్తాయని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెప్పినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చార్జబుల్ బ్యాటరీల్లో లిథియం వాడతారు.
ఒకవేళ రాజస్థాన్ లోని డెగానాలో లిథియం నిల్వలు ఉంటే.. చైనా దిగుమతులపై ఆధార పడటం తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే తైవాన్, అర్జెంటీనాల నుంచి లిథియం దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ప్రపంచవ్యాప్తంగా లిథియం అవసరాలకు చైనా ఏకచత్రాధిపత్యానికి చరమ గీతం పాడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

