EV Insurance | ఎలక్ట్రిక్ వాహనాలపై బీమా.. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి
EV Insurance | మామూలు వెహికల్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్ ధర ఎక్కువ. దీంతో ఈవీ యజమానులు సమగ్ర మోటార్ బీమా పాలసీ తీసుకోవల్సిందే.
EV Insurance | జీవిత బీమా.. హెల్త్ ఇన్సూరెన్స్ మాదిరిగానే అలాగే కొన్ని దశాబ్దాల క్రితమే స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటికింకా ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా హైబ్రీడ్ వెహికల్స్ మార్కెట్లోకి రాలేదు. అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మోటార్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర ఎక్కువ కావడంతో ఈవీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది.
ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతున్నది. కానీ సాధారణ సంప్రదాయ వెహికల్స్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర ఎక్కువగా ఉంది. కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేందుకు ఎంతో రీసెర్చ్ చేశాక సంతృప్తికర నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేమిటో చూద్దామా..!
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అత్యంత ఖర్చుతో కూడుకున్న భాగం బ్యాటరీ. వరదల్లో బ్యాటరీ పూర్తిగా దెబ్బ తినడం గానీ, చార్జింగ్ సమయంలో అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం గానీ ఉన్నాయి. కనుక మోటార్ ఇన్సూరెన్స్‌లో బ్యాటరీకి విడిగా కవరేజీ కల్పించాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ప్లాస్టిక్, మెటల్, గ్లాస్, ఫైబర్ తదితర లోహాలు, పదార్థాలతో తయారయ్యే విడి భాగాలు ఉంటాయి. అన్ని విడి భాగాల తరుగుదలపైనా కవరేజీ ఉండేలా బీమా తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్లో చార్జింగ్ కేబుల్, చార్జర్ భాగం కాదు. అవి దెబ్బ తినే అవకాశాలు ఉన్నందున చార్జింగ్ కేబుల్, చార్జర్లకు బీమా పాలసీలో ప్రత్యేక కవరేజీ కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా గాయపడినా, థర్డ్ పార్టీ నష్టాల భర్తీకి బీమా పాలసీలో ప్రత్యేక కవరేజీ కల్పించాల్సి ఉంటుంది.
గత నెలలో 85,911 ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. జూలైలో 77,868 విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2021 ఆగస్టులో 29,127 ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే సేల్ అయ్యాయి. గతేడాదితోపోలిస్తే నెలవారీగా ఈవీ సేల్స్ 11 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన 2021తో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

