ఇక ఓటీపీతోనే మార్పు

మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలపై టెలికం శాఖ
న్యూఢిల్లీ, మే 24: మొబైల్ ఫోన్ వినియోగదారులు త్వరలో తమ సిమ్ కార్డును మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు రావచ్చని టెలికం శాఖ ఏడీజీ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను టెలికం శాఖకు భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం పంపిందని చెప్పారు. అయితే దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తిరిగి టెలికం ఆపరేటర్లకే టెలికం శాఖ సూచించింది. దీంతో తదనంతర ఫలితాలపైనే నిర్ణయం ఉంటుందని ఇటీవలి ఓ ప్రకటనలో సురేశ్ కుమార్ చెప్పారు.
5జీకి సిద్ధం: ఎయిర్టెల్
దేశంలో 5జీ హైస్పీడ్ డాటా సేవల ప్రారంభానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని భారతీ ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. నెట్వర్క్ క్వాలిటీ పెంచేందుకు కర్నాటక, తమిళనాడుల్లో అదనపు స్పెక్ట్రంనూ సమకూర్చుకున్నట్లు చెప్పింది.
3 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్క్యాప్
ముంబై, మే 25: బీఎస్ఈలో లిస్టయిన కంపెనీలన్నింటి మార్కెట్ విలువ తొలిసారిగా సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను చేరింది. ఈ విశేషాన్ని బీఎస్ఈ ఇండియా సీఈఓ అశీష్కుమార్ చౌహాన్ ట్వీట్ చేస్తూ 6.9 కోట్ల మంది రిజిష్టర్డ్ ఇన్వెస్టర్లు, 1400మంది బ్రోకర్లు, 69,000 మంది మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్లు, 4700 కంపెనీలకు శుభాభినందనలు తెలిపారు.
సెన్సెక్స్ 111 పాయింట్లు అప్
గత శుక్రవారం పెద్ద ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 111 పాయింట్లు పెరిగి 50,652 పాయింట్ల వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- mobile network
- OTP
- security
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

