Ather 450S | ఎథేర్ 450ఎస్ ప్రీ-బుకింగ్స్ షురూ.. ఆగస్టు 3న ఆవిష్కరణ
Ather 450S | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ స్టార్టప్ ఎథేర్.. వచ్చేనెల మూడో తేదీన ఎథేర్ 450ఎస్ ఆవిష్కరించనున్నది. శుక్రవారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Ather 450S | ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ స్టార్టప్ ఎథేర్.. తన ఎథేర్ 450ఎస్ స్కూటర్‌ను వచ్చేనెల మూడో తేదీన మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఎథేర్ 450ఎస్ స్కూటర్ కొనుక్కోవాలని భావించే వారు రూ.2500 పే చేసి ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇష్టం లేకపోతే ఆ మొత్తం రీఫండ్ చేస్తారు. ఎథేర్ ఈవీ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలో ఎథేర్ 450ఎస్ అత్యంత చౌక.

ఎథేర్ 450ఎస్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్ షోరూమ్)తో ప్రారంభం అవుతుంది. ఎథేర్ 450ఎస్ స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్తోపాటు టీవీఎస్ ఐ-క్యూబ్, అంపేర్ ప్రైమస్ వంటి స్కూటర్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

సంప్రదాయ 125సీసీ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎథేర్ 450ఎస్ స్కూటర్‌పై సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. మూడు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఎథేర్ 450 ఎస్ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 115 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ గరిష్టంగా 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎథేర్ స్కూటర్ 450ఎస్’లో 6.4 కిలోవాట్ల (8.58 బీహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 26 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

