iPhone 15 Pre-booking | ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం..!
iPhone 15 Pre-booking | ఆపిల్ ఐఫోన్-15 సిరీస్ ఫోన్ల కోసం ప్రీ-బుకింగ్స్ శుక్రవారం ప్రారంభం అయ్యాయి.
iPhone 15 Pre-booking | ఆపిల్ ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 22 నుంచి ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆపిల్ వెబ్సైట్లో లభిస్తాయి. ఈ నెల 12న కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో వండర్ లస్ట్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆపిల్ యాజమాన్యం.. వాచ్ సిరీస్9, వాచ్ ఆల్ట్రా2, ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు రూ.79,990 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇంతకుముందు లైటెనింగ్ పోర్ట్‌తో మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ ఉత్పత్తులు ఈ దఫా యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో వస్తున్నాయి.
ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ 48 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో వస్తున్నది. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్ ఫోన్లలో ఏ16 బయోనిక్ చిప్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో ఏ17 బయోనిక్ చిప్ వినియోగించారు. ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో టైటానియం వాడారు.
ఇప్పటికే ఆపిల్ వాచ్ స్మార్ 9 సిరీస్, వాచ్ ఆల్ట్రా 2 వాచీల కోసం ప్రీ ఆర్డర్లు ప్రారంభించారు. ఇవి కూడా ఈ నెల 22 నుంచి లభిస్తాయి. సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ విత్ టైప్-సీ పోర్ట్‌తో సొంతం చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

