హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశీయ మార్కెట్లోకి శక్తివంతమైన సోడియం అయాన్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ సోడియన్ ఎనర్జీ వీటిని పరిచయం చేసింది.
ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ బాల పాచాయప్ప మాట్లాడుతూ…లీథియం బ్యాటరీలతో పోలిస్తే తక్కువ ధరకు లభించడంతోపాటు ఎక్కువకాలం మన్నికను కలిగివుండనున్నాయన్నారు.వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ బ్యాటరీలు అందుబాటులోకి రానున్నాయి.