Fixed Diposits | పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఏది బెస్ట్..
Fixed Diposits | బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల కంటే పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై మెరుగైన వడ్డీరేట్లు లభిస్తున్నాయి.
Fixed Diposits | గత మూడు నెలల్లో భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్బీఐ) 140 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసింది. ఇప్పుడు ఆర్బీఐ రెపోరేట్ 5.4 శాతం వద్ద ఉంది. దీనికి అనుగుణంగా పలు బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్ సేవింగ్స్ స్కీమ్స్ పట్ల నమ్మకం గల పాత తరం ఇన్వెస్టర్లకు ఇది శుభవార్తగా మారింది.
కరోనా మహమ్మారి వేళ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో స్మాల్సేవింగ్స్ పథకాలు దెబ్బ తిన్నాయి. 2021-22 ద్వితీయార్థంలో అధిక ద్రవ్యోల్బణంతోపాటు డిపాజిట్లపై దశాబ్ధి నాటి వడ్డీరేట్లతో ఇన్వెస్టర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో సంప్రదాయ ఇన్వెస్టర్లకు మంచి రోజులు వచ్చాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పోస్టాఫీసు డిపాజిట్స్ పాపులర్
చిన్న మొత్తాల ఇన్వెస్టర్లకు సొమ్ము ఆదా చేయడానికి పోస్టాఫీసు డిపాజిట్ పథకాలు చాలా పాపులర్. ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే సంప్రదాయ వడ్డీరేట్ల కంటే పోస్టాఫీసు డిపాజిట్ స్కీమ్‌లపై మెరుగైన వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు డిపాజిట్స్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీరేట్లు సవరిస్తుందని అనుకున్నా, ఆచరణలో అదేమీ జరుగలేదు.
పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ ఇలా
ఐదేండ్ల మెచ్యూరిటీ గల టర్మ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం, ఏడాది గడువు గల టర్మ్ డిపాజిట్‌పై సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో పోస్టాఫీసు 5.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ పథకం కింద కనిష్టంగా రూ.1000 డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఐదేండ్ల మెచ్యూరిటీ పోస్టాఫీసు డిపాజిట్ పథకాలపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఆదాయం పన్ను మినహాయింపు కోరొచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీపై వడ్డీరేటు ఇలా
ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఏడాది నుంచి మూడేండ్ల మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం.. మూడేండ్ల ఒక రోజు నుంచి ఐదేండ్ల మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ఐసీఐసీఐ బ్యాంకులో గరిష్ఠంగా 6.1 శాతం
గత నెల 19న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. ఏడాది నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.5 నుంచి 5.6 శాతానికి పెంచేసింది. మూడేండ్ల ఒకరోజు నుంచి ఐదేండ్ల గడువు వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
5.6 శాతం వరకు ఎస్బీఐ ఎఫ్డీలపై వడ్డీ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ.. ఏడాది నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.45 నుంచి 5.55 శాతం వడ్డీ ఆఫర్ చేసింది. మూడేండ్ల ఒక రోజు నుంచి ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.6 శాతం వడ్డీ అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

