Poco X6 5G | కొత్త కలర్ ఆప్షన్లో పోకో ఎక్స్6 5జీ..ఇవీ స్పెషిఫికేషన్స్..!
Poco X6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎక్స్6 5జీ ఫోన్ కొత్తగా స్కైలైన్ బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది.
Poco X6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎక్స్6 5జీ ఫోన్ కొత్తగా స్కైలైన్ బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను గత జనవరిలో మిర్రర్ బ్లాక్, స్నో స్టోర్మ్ రంగుల్లో ఆవిష్కరించింది. పోకో ఎక్స్6 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ఎస్వోసీ చిప్సెట్ తోపాటు అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతోపాటు 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. తాజాగా పోకో ఎక్స్6 5జీ ఫోన్ స్కైలైన్ బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది.
పొకో ఎక్స్6 5జీ ఫోన్ స్కైలైన్ బ్లూ కలర్ ఆప్షన్‌తోపాటు 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1000 వరకూ ఫ్లిప్ కార్ట్ ధర తగ్గిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు ఐదు శాతం క్యాష్ బ్యాక్ తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.21,999 వరకూ ధర తగ్గింపు ఉంటుంది. సెలెక్టెడ్ మోడల్ ఫోన్ల ఎక్స్చేంజ్ పై రూ.1000 రాయితీతోపాటు ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి.
పోకో ఎక్స్6 5జీ ప్రో ఫోన్‌తోపాటు పోకో ఎక్స్6 5జీ ఫోన్ ను గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. మూడు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేండ్లపాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందివ్వనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.67 అంగుళాల 1.5 కే (1,220×2,712 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్‌తోపాటు 512 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్ వరకూ లభిస్తుంది.
పోకో ఎక్స్6 5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

