Poco M6 Plus 5G | పోకో నుంచి మరో బడ్జెట్ ఫోన్ పోకో ఎం6 ప్లస్ 5జీ.. త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరణ..!
Poco M6 Plus 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Poco M6 Plus 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత డిసెంబర్లో దేశీయ మార్కెట్లోకి ఎంటరైన పోకో ఎం6 5జీ ఫోన్ కొనసాగింపుగా పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర బడ్జెట్ లోనే ఉంటుందని తెలుస్తోంది. పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్ ఎట్ రేర్ ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.79 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

