Poco M6 5G | పోకో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Poco M6 5G | Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యంత చౌక ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యంత చౌక ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ చిప్సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. రెండు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
గాలక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ కలర్ ఆప్షన్లలో పోకో ఎం6 5జీ ఫోన్ వస్తుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499, జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,499, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,499లకు లభిస్తున్నది.
ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా పోకో ఎం6 5జీ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
పోకో ఎం6 5జీ ఫోన్ 6.74-అంగుళాల హెచ్డీ+ (1600×720 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 260పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీయూవీ లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్‌తో వస్తుంది.
50-మెగా పిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు మరో సెకండరీ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. 3.5-ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూ-టూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

